తాళ్లూరు విద్యుత్ సబ్స్టేషన్ రోడ్లో భారీ ఇసుక టిప్పర్లు, గ్రానైడ్ లారీలు తిరగటంతో పలు చోట్ల పైపులు పగిలి పెద్ద పెద్దలు గుంటలు ఏర్పడ్డాయి. సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ గుంతలను పరిశీలించి పలు చోట్ల ఉన్న లీకేజీలను గమనించి ప్రొక్లయిన్ సహాయంతో గుంతలు తీయించి మరమ్మత్తులు చేపట్టారు. ఈఓఆర్డీ ప్రసన్నకుమార్, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

