గ్రామాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన నేరాలను నియంత్రించవచ్చని మారళ్ళ సచివాలయం మహిళా పోలీస్ ఐ నిర్మలాదేవి అన్నారు. మండలంలోని మారెళ్ళ గ్రామంలో బుధవారం ఆ గ్రామ సర్పంచి గోపన బోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళా పోలీస్ నిర్మలాదేవి మాట్లాడుతూ గ్రామాల్లో నలుమూలల ప్రధాన కూడళ్ళలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వలన దొంగతనాలు నిరోధించవచ్చన్నారు. మండలంలోని 22 గ్రామాలలో 42 సీసీ కెమెరాలు ఏర్పాటుకు చేయుటకు అధికారుల నిర్ణయించారని, ఒక్కొక్క సీసీ కెమెరా విలువ 17000 వేలు విలువ ఉంటుందని, ఎన్టిపిసి టెక్నాలజీస్ అధినేత ఎన్ సౌజన్య అనిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్మెన్ సిహెచ్ కోటేశ్వరరావు, రమేష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాల నియంత్రణ
29
Mar