మహాయజ్ఞంలా శాశ్వత భూహక్కు చట్టం – ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

శాశ్వత హక్కుదారులుగా భూమిపై హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ఒక మహాయజ్ఞంలా వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షిత పథకాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలో రీ సర్వే కార్యక్రమంలో భాగంగా భూమి కొలతలు వేసే డ్రోన్ ఎల క్ట్రానిక్ సిస్టం కెమెరాను ఎమ్మెల్యే బుధ వారం ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ 100 ఏళ్ల తర్వాత పట్టణ ప్రాంత ప్రజల స్థిరాస్తులు సర్వే జగనన్న ప్రభుత్వంలో జరగడం భూ రక్షణకు నిదర్శనమన్నారు. నిష్పక్ష పాతంగా భూమి కొల తలు వేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నగర పంచాయతీ కమిషనర్ మహేష్, తహసీల్దార్
శ్రావణ్ కుమార్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, కౌన్సిలర్లు వీసీరెడ్డి, జగన్నాథం మోహన్ బాబు, సొసైటీ అధ్యక్షుడు వేమిరెడ్డి చెన్నారెడ్డి, ఎంపీపీ సుధా అచ్చయ్య, నాయకులు శివారెడ్డి, గోపాల్, వాసుదేవరెడ్డి, యర్రయ్య, వెంకటేశ్వరరెడ్డి, హరీష్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *