దర్శి పట్టణంలోని గాంధీనగర్ , రామాలయం దేవాలయం వద్దనిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో వైసీపీ నాయకులు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివార్ల ఆశీర్వాదాలు అందుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వైవి సుబ్బయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి ,రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనింగ్ డైరక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు కీసరి రాంభూపాల్ రెడ్డి , జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి , ఎంపీటీసీ కీసరి శ్రీనివాసులురెడ్డి, కౌన్సిలర్ లు మేడం మోహన్ రెడ్డి, తుళ్లూరు బాబురావు, బాబు, నాయకులు గంజి వెంకటేశ్వర్లురెడ్డి, కుందురు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





