దర్శి లోని కురిచేడు రోడ్డులో రాత్రికి రాత్రే ప్రభుత్వ భూముల్లో వెంచర్ల వెలుస్తున్నాయి.రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములంటూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాధుడే లేకపోతున్నాడు. ఎవరికి వారే యదేచ్చగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటూ నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి కురిచేడు రోడ్డులో కనిపిస్తూ ఉంది. మరికొన్నిచోట్ల ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను సైతం తొలగించి పక్కన పడేస్తున్న పరిస్థితులు కూడా లేకపోలేదు.ఏది ఏమైనా ప్రభుత్వ భూముల ఆక్రమితదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ప్రభుత్వ స్థలాలు రాబోయే రోజుల్లో పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితులు కూడా వస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్న రియల్ వ్యాపారుల తీరుతో ఓవైపు రెవిన్యూ అధికారులకు, మరోవైపు నగర పంచాయతీ అధికారులకు తల పట్టుకునే పరిస్థితులు దర్శి లో ఏర్పడ్డాయి. ఒక్కసారిగా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం దర్శి పై కన్నేస్తే ఏ విధమైన చర్యలు మునుముందు తీసుకోపోతున్నారో వేచి చూడాల్సిందే మరి.
