ఆర్మీ జవాన్ ఉద్యోగ విరమణ

ముండ్లమూరు మండలంలోని వేముల బండ గ్రామానికి చెందిన మామిళ్ళపల్లి లక్ష్మణరావు 2005 సంవత్సరంలో ఆర్మీ సిపాయిగా, లాన్స్ నాయక్(1) నాయక్(11) హవల్దార్(111) గా18 సంవత్సరాలు పనిచేశారు. శుక్రవారం గుజరాత్ రాష్ట్రంలోని బూజీ జిల్లాలో ఆర్మీ కేంద్రంలో రిటైర్మెంట్ అయ్యారు. ఈ సందర్భంగా మిలటరీ ఉన్నతాధి కారుల నుండి ప్రశంసా పత్రం అందుకున్నారు. విధి నిర్వహణలో ఇతరులకు ఆదర్శంగా నిలిచి నా లక్ష్మారావు ను ఘనంగా అభినందించారు. ఇప్పటివరకు ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, గుజరాత్ లో రెండు సార్లు, జమ్మూ కాశ్మీర్లో రెండుసార్లు, గుజరాత్ రాష్ట్రంలోని బూజి జిల్లాలో పదవి విరమణ పొందారు 2005 వ సంవత్సరంలో చేరి మిలటరీ లో ఏడు మెడల్స్ సాధించారన్నారు. మామిళ్ళపల్లి వెంకటేశ్వర్లు అంజమ్మ దంపతులకు నలుగురు కుమారులు వారిలో రామారావు ,శేషయ్య, లక్ష్మణరావు, కోటేశ్వరరావు కలరు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *