ఫ్యామిలీ ఫిజీషియన్ పేదలకు వరం

గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఫ్యామిలీ ఫిజీషియన్ సేవ లు ఒక వరం అని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పెదరావిపాడు గ్రామంలో శుక్రవారం డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వద్ద ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ కి దీటుగా ప్రభుత్వ వైద్యశాలలో అధనూతన పరికరాల తో వైద్య సేవలు అందిస్తున్నామని, 74 రకాల మందులతో, 12రక్త పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కిడ్నీ, లివర్, పరీక్షలకు సంబంధించి మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. ఈ శిబిరంలో164 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో షుగర్ ,బీపీ ,గర్భిణీలో, బాలింతలు, జ్వరాలకు, వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ డి వెంకటరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, నాయుడుపాలెం సి హెచ్ ఓ రత్నకుమారి, డీఈవో వెంకట ప్రసాద్, ఆషాలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *