ముండ్లమూరు గ్రామాల్లోని భూముల కు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే మీ గ్రామాల్లో జరుగుతున్న గ్రామ సభ కు అన్ని ఆధారాలతో వచ్చి సమస్యలను తెలియజేసుకోవాలని రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్ అన్నారు. మండలంలోని కెల్లంపల్లి పంచాయతీ పరిధిలోని బసవాపురం గ్రామంలో శుక్రవారం రీ సర్వేలో భాగంగా గ్రౌండ్ తృతింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ గ్రామాల్లో గల భూములు సంబంధించిన ప్రతి ఒక్కరు తమ భూముల సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సభ దృష్టికి తీసుకురావాలన్నారు. తమ పేర్ల మీద ఉన్న భూమి వివరాలు తప్పుగా నమోదయి ఉంటే రికార్డులు పరిశీలించి వారి పేర్ల మీద ఆన్లైన్ చేస్తామన్నారు. మరణించిన వారి పేరు మీద భూమి వివరాలు ఉంటే వారి వారసులకు ఆన్లైన్ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి అది. సచివాలయ సర్వే యర్ రామకృష్ణ, వీఆర్వోలు వేణుగోపాల్ రెడ్డి, పెద్దన్న, కోటయ్య, రమణ, మురళి, రవి, దయానందం, అయ్యప్ప ,పున్నారావు, నాగేశ్వరరావు, సుశీల, జాన్ లిపి తదితరులు పాల్గొన్నారు.
భూమి సమస్యలు ఉంటే తెలియజేయాలి
31
Mar