విద్యార్థులు ప్రాథమిక దశ నుండే కష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్ ఏ సునీత అన్నారు . మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో శుక్రవారం పదవ తరగతి విద్యార్థినిలకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తీర్ణత శాతం తీసుకురావాలని ఆమె కోరారు. ఉత్తీర్ణత శాతం అనేది మీ జీవితానికి మొదటి మెట్టు అన్నారు. పదవ తరగతి పాస్ కావడం కాదని. పై చదువులకు వెళ్లాలంటే వందకు వంద మార్కులు తీసుకు వస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుందన్నారు. విద్యార్థినిలు గ్రేడ్ వన్ స్థాయిలో పాసై పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వసుంధర, రత్నమాలిని దేవి, చంద్రకళా, ప్రియదర్శిని, పద్మజా, శారా ,కోటేశ్వరి, సౌమ్య, స్వర్ణ, నాగలక్ష్మి, సునీత, కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

