నేరగాళ్లకు అడ్డుకట్ట వేయాలంటే సీసీ కెమెరాలతోనే సాధ్యమవుతుందని పోలవరం గ్రామ సర్పంచ్ నంబూరి లీలమ్మ యేసు అన్నారు. మండలంలోని పోలవరం గ్రామంలో శుక్రవారం మండల వైసీపీ నాయకులు నెమలిదిన్నె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో దొంగతనాలు జరిగిన,కొత్త వ్యక్తులు సంచరించిన కెమెరాలలో నమోదు అవుతాయని తెలిపారు ఈ కెమెరాలు ఎన్ టి పి సి టెక్నాలజీ అధినేత ఎన్ సౌజన్య అనిల్ మాట్లాడుతూ ఒక్కొక్క సీసీ కెమెరా విలువ 20000 ఉంటుందని, పంచాయతీలకు ఎక్కువ మొత్తంలో కావలసినందున 17 వేలకు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కాశీరాజు తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాలు తోనే నేరగాళ్లకు అడ్డుకట్ట
31
Mar