ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో తళ్లపు రెడ్డి పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు 450 పరీక్షల సామగ్రి అందించి చేయూత ఇచ్చారు. ట్రస్ట్ పౌండర్ టి. ప్రశాంత రెడ్డి, కో ఫౌండర్ టి.శివశంకర్ రెడ్డిలు పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందించారు.
విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తమ ఫౌండేషన్ తరపున పేద విద్యార్థులకు చేయూత ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, సుబ్బారావు, గోవర్ధన్, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.


