దర్శి మండలం రాజంపల్లిలో నదీ తీరాన వెలసిన సువర్చలా సమేత ప్రసన్నాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల శుక్రవారం అత్యంత వైభ వంగా జరిగింది. జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామిని దర్శించు కున్నారు. ఉదయం నుంచే పండితులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష తమలార్చనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకుడు డాక్టర్ మద్ది శెట్టి శ్రీధర్ పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు డాక్టర్ మద్దెశెట్టి శ్రీధర్ ను ఘనంగా సత్కరించారు. భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహించారు. పలు స్వచ్ఛంద సేవా సంఘాల సభ్యులు భక్తులకు తాగునీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదాలు అందించారు. రాత్రి ప్రధాన పార్టీల సానుభూతిపరులు ఏర్పాటుచేసిన అయిదు విద్యుత్తు ప్రభలు కాంతులీనాయి. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

