పీఎం కిసాన్ వైఎస్సార్ రైతు భరోసా నగదు జమకు ఈ- కేవైసీ తప్పనిసరి అని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. మన్నేపల్లి పంచాయితీలో శుక్రవారం ఆయన తన సిబ్బందితో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. వెబ్ ల్యాండ్లో భూమి వివరాలు కలిగి ఉండి, ఈ- కెవైసి మరియు ఎన్ఎపిసిఐ లింకు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించారు. అర్హలైన రైతులు పోస్టు ఆఫీస్ ద్వారా కూడ ఖాతాలు తెరచి, ఎన్టీపిసిఐ లింకు చేయించుకోవాలని సూచించారు. మండలంలో ఇంకా 1861 మంది రైతులు ఈ- కెవైసి చేయించుకోవాల్సి ఉందని వివరించరాఉ. గ్రామ వ్యవ సాయ సహాయకులు ఓటీపీ ద్వారా కూడ ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్పారు. విఏఏ నాగరాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పీఎం కిసాన్ 14వ విడుతకు ఈ- కెవైసి తప్పనిసరి
31
Mar