తళ్లపు రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల కాలంలో పరీక్షలకు అవసరమైన సామగ్రిని అందిస్తూ చేయూత ఇవ్వటం అభినందనీయమని వక్తలు అన్నారు. తాళ్లూరు కస్తూరిభా, ఎబీసీ, వికే ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు శనివారం పరీక్షల సామగ్రి అందించి చేయూత ఇచ్చారు. ట్రస్ట్ చైర్మన్ టి. ప్రశాంత రెడ్డి, కో ఫౌండర్ టి. శివశంకర్ రెడ్డిలు పాల్గొని విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందించారు. విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తమ పౌండేషన్ తరపున పేద విద్యార్థులకు చేయూత ఇస్తున్నట్లు చెప్పారు. పేదరికంలో ఉండి ప్రతిభ చాటుతున్న విద్యార్థులకు పోత్సాహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏ బి సి హై స్కూల్ కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబు, ప్రిన్సిపాల్ సుజిత తదితరులు పాల్గొన్నారు.


