గుంటి గంగా భవాని అమ్మవారి హుండీ ఆదాయం లెక్కింపు – రూ. 2.09 లక్షలు

ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని ఆలయ హుండీ ఆదాయం దేవాదాయ శాఖ ఇన్స్ఫెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం లెక్కించారు. మూడు నెలల పది రోజులకు గాను రూ.2,00,948 వచ్చినట్లు ఈఓ భాస్కర్ రెడ్డి తెలిపారు. చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, ఆర్ఎ కోట శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు చలువాది శింగయ్య, గురు బ్రహ్మా, యాడిక యలమందా రెడ్డి, ప్రభాకర్, దేవదానం, ఎన్. శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తిరునాళ్ల వేలం పాటలు నిర్వహణ….
గుంటి గంగా భవాని తరునాళ్ల సందర్భంగా టెంకాయల అమ్మకానికి, కొబ్బరి చిప్పల ప్రోగు చేసుకుని హక్కు నిమిత్తం వేలం పాటను దేవదాయశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. టెంకాయల అమ్మకానికి చీమకుర్తికి చెందిన గాలెం ధనలక్ష్మి రూ.2.75 లక్షలకు కొబ్బరి చిప్పల పొగుకు శింగర కొండకు చెందిన ఎర్రగొర్ల శ్రీనివాసరావు రూ. 39,500లకు వేలం పాటలో హక్కును దక్కించుకున్నారు. గత సంవత్సరం రూ. 3.48 లక్షలకు వేలం పాటలో హక్కులు పొందగా, ఈ సంవత్సరం రూ. 3.14 మాత్రమే పలికాయి. దీంతో గత సంవత్సరం కన్నా రూ. 34వేల రూపాయల తక్కువకే హక్కుదారులు వేలం పాటను దక్కించుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *