శివరామపురం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గుంటి గంగా భవాని తిరునాళ్లలో ప్రభ ఏర్పాటుకు మాజీ సర్పంచి నిశంకం హనుమంతరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు శనివారం గుంటి గంగా భవాని ప్రాంతంలో స్థలాన్ని ఎంపిక చేసారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీగా బయలు దేరి తాళ్లూరు, కొత్తపాలెం, మాధవరం, తూర్పు గంగవరం మీదుగా గుంటి గంగా భవాని అమ్మవారి క్షేత్రానికి చేరుకుని పూజలు చేసారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి. మాజీ సర్పంచి నిశంకం హనుమంతరావు, కోటేశ్వరరావు, వెన్నపూస వెంకా రెడ్డిల ఆధ్వర్యంలో జెండాను పాతారు. ముందుగా శివరామపురంలోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

