ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు గ్రామంలో శనివారం 250 గేదెలకు ,దూడలకు గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ కే కోటిలింగం తెలిపారు. జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 24వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవులకు, గేదెలకు, దూడలకు ,ఎద్దులకు టీకాలు వేస్తున్నామన్నారు. మూగ జీవాలకు వ్యాధులు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తల చర్యలో భాగంగా గాలికుంటు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, గ్రామాల్లోని పోషపోషకులు మూగ జీవాలకు టీకాలు వేయించుకోవాలని ఆయన తెలిపారు.
250 గేదెలకు గాలికుంటు టీకాలు
01
Apr