గర్భిణీలు తమ ఆరోగ్యం పట్ల బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని వైద్యాధికారి సిహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోగల పూరిమెట్ల గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లీన్ కు వద్ద శనివారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ఎండలో తిరిగినట్లయితే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ చల్లని ప్రదేశాలలో ఉండాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్లు ఎక్కువగా త్రాగాలన్నారు, లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దొరికే ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు తీసుకొని ఒక ప్యాకెట్ను ఒక లీటర్ నీటిలో కలుపుకొని త్రాగాలన్నారు. ఈ శిబిరంలో 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో బాలింతలు 12 గర్భిణీలు 14షుగర్ 38 బీపీ 35 జ్వరాలు జలుబు దగ్గులు45 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరరావు, సిహెచ్ఓ లక్ష్మి, డీఈఓ వెంకటప్రసాద్, ఏఎన్ఎం బి రాబి ఆషాలు పాల్గొన్నారు.
గర్భిణీ లు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి
01
Apr