పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 3 వతేదీ ప్రారంభమై 18వ తేదీ తో ముగుస్తాయని నేపథ్యంలో ముండ్లమూరు మండలంలో 3 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎంఈఓ జి చంద్రమోహన్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ3 పరీక్ష కేంద్రాలైన ముండ్లమూరు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో8 రూముల లో180 విద్యార్థిని విద్యార్థులు, ఆదర్శ పాఠశాలలో 8 రూములలో190 విద్యార్థిని విద్యార్థులు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 5రూములలో 100 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలో వ్రాయనున్నారు. మొత్తం 21 రూములలో 474 మంది బాలికలు, బాలురు పరీక్షలో వ్రాయనున్నారు. ముండ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో62 మంది ఆదర్శ పాఠశాలలో88 మంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో32 మంది వేముల లో36 మంది ఈ ధరలో81 మంది, మారెళ్ళలో83 మంది, ఉమామహేశ్వరపురంలో71 మంది, పూరి మెట్లలో21 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ఆయన తెలిపారు.
పది పరీక్షలకు సర్వం సిద్ధం
01
Apr