గ్రామాల్లో పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని పొదిలి కమ్యూనిటీ ఆఫీసర్ పి బ్రహ్మానందం తెలిపారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల పోలవరం, శంకరాపురం, గ్రామాలలో శనివారం ఆయన ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో బజార్లు వెంట తిరుగుతూ సైడ్ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైడ్ కాలువలలో చెత్తాచెదారం పేరుకుపోయి మురుగునీరు ఎటు పోక దుర్వాసన వస్తుందని అన్నారు. మురుగు నీరు నిల్వ ఉన్నచోట బ్లీచింగ్ ఫినాయిల్ పిచికారి చేయించాలన్నారు. పంచాయతీ కార్యదర్శి తో మాట్లాడి కాలువలను పారిశుద్ధ్య కార్మికుల చేత శుభ్రం చేయించాలని సూచించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి నీటి తొట్టెలను పరిశీలించి లార్వా ఉన్న నీళ్ల తొట్లను పారబోయించారు. తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గృహవాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సిహెచ్ఓ శరణ్య, ఏఎన్ఎం ప్రియదర్శిని, ఆషాలు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి
01
Apr