ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని ఎంపీడీవో కే కుసుమకుమారి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం వాలంటీర్ల నియమాకానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. పులిపాడు పంచాయతీ పరిధిలో ఒక వాలంటీర్ పోస్ట్ ఖాళీ కాగా 5 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ నిష్పక్షపాతంగా ఇంటర్వ్యూలో నిర్వహించి అర్హత గల వారినిఎంపిక చేస్తామన్నారు. ఎంపిక కాబడిన వాలంటీర్లు నీతి నిజాయితీతో నిబద్దతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఏవో బి రామాంజనేయులు, ఈవో పి ఆర్ డి, పి ఓబులేసు, జూనియర్ అసిస్టెంట్ టీ కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.
వాలంటీర్లు బాధ్యతగా పని చేయాలి
01
Apr