దర్శి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం లో మండల సచివాలయ , కన్వీనర్లు, గృహసారధుల సమావేశం నిర్వహించారు . దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోదరులు డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ….. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వారధిలా, సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశం గర్వపడేవిధంగా ప్రజా సంక్షేమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను ప్రజల చెంతకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులుపై ఉందన్నారు.మా నమ్మకం నువ్వే జగనన్న అన్న నినాదంతో ముందుకు సాగుతూ అభివృద్ది ఫలాలు అందుకుంటున్న లబ్ధిదారులకు జగనన్న ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను వివరించాలన్నారు. గృహ సారథులు వారికి అందచేసిన సామగ్రిలోని బ్యాడ్జీలు ధరించి,వారి వాలంటీర్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రతినిధులుగా వెళ్లాలన్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అని ముద్రించిన కరపత్రాలుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమి చేశారో, ఇప్పటి మన జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఏమి మేలు చేస్తున్నామో ఉంటుందన్నారు.మన జగనన్న ప్రభుత్వంలో కుల,మత, వర్ణ,వర్గ రాజకీయాలకతీతంగా , మనల్ని విమర్శించి,మనల్ని ద్వేషించే వారికి కూడా సంక్షేమ పథకాలును అమలు చేస్తున్నామన్న విషయాలను ప్రతి కుటుంబానికి తెలియజేసి ప్రభుత్వానికి మద్దతు కూడగట్టాలన్నారు.

