ఘనంగా పోషణ పక్వాడ వారోత్సవము నిర్వహణ

తాళ్లూరు ప్రాజెక్టు చందలూరు సెక్టారు పరిధిలోని శివరాజ్ నగర్ గ్రామం అంగన్వాడి కేంద్రం(s’c)_3 నందు అంగన్వాడీ కార్యకర్త పుప్పాల బాలమ్మ ఆధ్వర్యంలో జరిగిన పోషణ పక్వాడా వారోత్సవాలకు తాళ్లూరు ప్రాజెక్ట్ శిశు సంక్షేమ ప్రాజెక్టు అధికారిని (సీడీపీఓ) సీహెచ్ భారతి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ….. తక్కువ ధరలలో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గర్భవతులు. బాలిక తల్లులు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న వైయస్సార్ పోషణ కిట్టును తల్లులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చిన్నపిల్లలలో పోషకాహార లోపం లేకుండా ఉండేందుకు7 నెలల నుండి 3 సంవత్సరముల వరకు వయసు గల పిల్లలకు బాలామృతము.3 సంవత్సరముల నుండి5 సంవత్సరములు గల పిల్లలకు అంగన్వాడి కేంద్రంలోని భోజన ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ద్వారా అందిస్తున్నటువంటి ప్రతి పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో చందలూరు సెక్టార్ అంగనవాడి సూపర్వైజర్ రమాదేవి. అంగన్వాడీ కార్యకర్తలు పుప్పాల బాలమ్మ. పార్వతి. లక్ష్మీ. సెక్టార్ పరిధిలోని అంగన్వాడి కార్యకర్తలు. గర్భిణీ. బాలింత స్త్రీలు. పలువురు తల్లులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *