బాబు జగజ్జివన్ రావ్ 115వ జయoతిసభను జయప్రదం చే యాలి

తహశీల్దార్ కార్యాలయంలో శనివారం బాబు జగజ్జీవన్ రావ్ 115వ జయంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక దర్శి తహశీల్దార్ శ్రావణ్ కుమార్ చేతుల మీదుగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రదళితసేన ప్రధానకార్యదర్శి జీ ప్రేమ్ కుమార్ నవ్యాంధ్ర మాదిగ చర్మకారుల డబ్బు కళాకారుల రాష్ట్ర వ్యవస్థాపకఅధ్యక్షులు కె. గోవిందప్రసాద్ మాట్లాడుతూ .. ఈనెల 5వ తేదీన బుధవారం 10 గంటలకు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో బాబు జగజ్జివన్ రావు 115వ జయంతిసభ జరుగుతుందని వారు తెలిపారు . కావున దర్శి నియోజకవర్గంలోని ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల నాయకులు దళిత సంఘాల నాయకులు sc,st,BC, మైనార్టీ నాయకులు అభ్యుదయవాదులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము.
కార్యక్రమంలో దర్శి నగరపాలక కౌన్సిలర్ లు ,V.C రెడ్డి, రామ్మోహన్ రెడ్డి బహుజనసమాజ్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇత్తడి. జోషి, మాదిగ మహానాడు దర్శి నియోజకవర్గం ఇంచార్జ్ గట్టుపల్లి ప్రసాద్ జి మార్క్ తదితరులు పాల్గొన్నారు .

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *