సమాజంలో ఆత్మన్యూనతా , అబధ్రతా భావాలను అన్ని వర్గాల నుండి దూరం చేయటం కోసం స్టెప్ సంస్థ నిర్విరామ కృషి చేస్తుందని ప్రముఖ సైకాలజిస్ట్,వ్యక్తిత్వవికాస నిపుణులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు అన్నారు. విద్యార్థులు,ఉపాధ్యాయులు,
ఎడ్యుకేటర్స్,తల్లి తండ్రులు లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టెప్ జాతీయ సమితి ఆధ్వర్యంలో ఉచిత వక్త శిక్షణ కార్యక్రామాలు నిర్వహిస్తున్నట్లు అయన తెలిపారు. నేటి సమాజంలో విద్యార్థులు,యువత తో పాటు అన్ని రంగాల్లో ఒత్తిడి అనివార్యమై ఆత్మహత్యలు పెరగటం,తీసుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోవటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అలాంటి వారిని వక్తలుగా తీర్చిదిద్ది సమాజంలో మెరుగైన పౌరులుగా తీర్చి దిద్దటం కోసం స్టెప్ జాతీయ సమితి ద్వారా ఉచిత వక్త శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 8,9 తేదీలలో విజయవాడ లో నిర్వహించనున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఏప్రియల్ 7నుండి
ఈ శిక్షణా కార్యక్రమం లో పాల్గొన దలచిన వారు ఏప్రియల్ 7 తేదీ కల్ల విజయవాడ శిక్షణా కేంద్రనికి రావలని, వారి పేర్లు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోర్స్ కోఆర్డినేటర్ నారా రాజశేఖర్, ప్రిన్సిపాల్ వాసు లు తెలిపారు. పూర్తి వివరాలకు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, ఫోన్ నెంబర్ 9030644440,. కోఆర్డినేటర్ రాజశేఖర్ +91 93921 44499ను సంప్రదించాలని కోరారు.
