సోమవారం నుండి పది పరీక్షలు

ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. తాళ్లూరు మండలంలో ఏడు పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు. తాళ్లూరులో వికే ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, సరస్వతి హైస్కూల్, తూర్పు గంగవరంలో జెడ్పీ ఉన్నత పాఠశాల, ప్రగతి హైస్కూల్, బొద్దికూరపాడులో జెడ్పీ ఉన్నత పాఠశాల, అమెరికన్ పబ్లిక్ స్కూల్స్న పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు. ఆయా కేంద్రాలలో మంచి నీటి సౌకార్యాలను పరిశీలించి తగిన ఏర్పాట్లు చేసారు. 778 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ జి. సుబ్బయ్య తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా సివిల్ డ్రస్లు మాత్రమే వేసుకోవాలి, ఎటువంటి యూనిఫామ్స్ ధరించి రాకూడదని ఎంఈఓ తెలిపారు.
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 114 సెక్షన్ అమలు … ఎస్సై ప్రేమకుమార్ పరీక్షలు ప్రారంభ నేపధ్యంలో ఆయా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపారు. జెరాక్స్ కేంద్రాలు కూడ పరీక్షా కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో మూసి వేసి ఉంచాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని అన్నారు. మాల్ ప్రాక్టిస్కు పాల్పడే విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్ కూడ ప్రాసిక్యూట్ చేయబడతారని ఎస్సై ప్రేమ్ కుమార్ వివరించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *