పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనాయి. మండలంలోని ఏడు పరీక్షా కేంద్రాలలో 869మందికి గాను 880 మంది హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎస్సై ప్రేమకుమార్ తన సిబ్బందితో పటిష్టబందోబస్తు నిర్వహించారు. గేట్ వద్దనే విద్యార్థుల హాల్ టికెట్స్ పరిశీలించి పరీక్షల ప్రాంగణంలోనికి అనుమతి ఇచ్చారు. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులను పరీక్షా కేంద్రం లోపలి వరకు అనుమతి ఇచ్చేవారు అయితే నిబంధనలకు అనుగుణంగా గేట్ వరకు మాత్రమే అనుమతి ఇవ్వటంతో తల్లిదండ్రులు విద్యార్థులకు గేట్ వద్దనే వదిలి వేళ్లారు. ఎస్సై ప్రేమకుమార్ . ఎంఈఓ జి. సుబ్బయ్య. అన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించారు.

