అంగన్వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

తాళ్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, ఆయాల పోష్టులను అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీఓ సీహెచ్ భారతి తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో దర్శి మండలం వెంకటాచలం పల్లి (ఒసీ) సెంటర్లో అంగన్వాడీ కార్యకర్త పోష్టు, తాళ్లూరు మండలం దోసకాయలపాడులో ఆయా (ఎస్సీ), ముండ్లమూరు మండలం పోలవరం-2లో ఆయా (ఎస్సీ) పోస్టులకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు దారులు సంబంధిత రిజర్వేషన్ కేటగిరి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈనెల 17 సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *