ఈనెల 8న నిర్వహించనున్న గుంటి గంగ తిరునాళ్లను ప్రభల నిర్వాహకులు సీఐ ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు సహకరించాలని దర్శి రామకోటయ్య కోరారు. గుంటి గంగా భవాని ఆలయం వద్ద సోమవారం ప్రభల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శి మాట్లాడుతూ ప్రభల ఏర్పాటు చేయు నిర్వాహకులు ప్రభల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్ణీత సమయంలో ముగించాలని చెప్పారు. దేవస్థానం వద్ద తీసుకుంటున్న జాగ్రత్తలు, ట్రాఫిక్ నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో ఎస్సై ప్రేమ్ కుమార్, గుంటి గంగా భవాని ఆలయ కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

