ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరవ తరగతి నుండి పదవ తరగతి పరీక్షలు పూర్తి అయ్యేంతవరకు మధ్యాహ్న భోజన సమయంలో అరటి పండ్లు పెరుగు పంపిణీ చేయడం జరుగుతుందని మాజీ సర్పంచ్ సుంకర ఇందిరా బ్రహ్మానందరెడ్డి తనయుడు విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా సోమవారం విద్యార్థులకు అరటి పండ్లు పెరుగును గ్రామ సర్పంచి గోపన బోయిన శ్రీనివాసరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. మా తండ్రి స్వర్గీయ లాయర్ బ్రహ్మారెడ్డి జ్ఞాపకార్థం అరటి పండ్లు పెరుగు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం సమయంలో పెరుగు అరటి పండ్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలా బ్రహ్మం, మొల తోటి రామారావు, చొప్పరపు శీను తదితరులు పాల్గొన్నారు.


