రెవెన్యూ సమస్యలకు సత్వరమే పరిష్కారం

గ్రామాల్లో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు వేగవంతం చేస్తానని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎండి నయీమ్ అహ్మద్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం తహసిల్దార్ గా నూతన బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్ ఉషారాణి బదిలీపై జరుగుమల్లి వెళ్లారు. జరుగుమల్లి లో పనిచేస్తున్న ఎండి నయి అహ్మద్ ముండ్లమూరుకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు ఉన్నవారు నేరుగా తహసిల్దార్ కార్యాలయం సంప్రదించాలన్నారు. అనంతరం సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందన లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి. ల్యాండ్ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్. మండల సర్వేయర్ శివ ప్రసాద్. సీనియర్ అసిస్టెంట్ పోగుల శేషగిరిరావు. వీఆర్వోలు దయానందం, వేణుగోపాల్ రెడ్డి, అయ్యప్ప రెడ్డి, కోటయ్య, మురళి, రవి, పున్నారావు, రమణ, జాన్ లిపి. పెద్దన్న. సుశీల. నాగేశ్వరరావు. గురవయ్య, పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *