ముండ్లమూరు మండలంలో ముండ్లమూరు గ్రామానికి చెందిన కుమ్మిత పేరారెడ్డి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే ముండ్లమూరు గ్రామానికి చెందిన కుమ్మిత పేరారెడ్డి ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుకు తమ వంతు నిధులు కేటాయిస్తూ మౌలిక వసతుల మెరుగుకు కృషి చేస్తున్నారు. గ్రామంలో సైడ్ కాలువ ఇతర వసతుల లేమితో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ప్రజా ప్రతినిధులు అధికారులు గమనిస్తున్నప్పటికీ నిధుల లేమితో ఏమి చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఈ విషయాన్ని గమనించిన కుమ్మితి పేరారెడ్డి ముందుకు వచ్చి స్థానిక సచివాలయం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద డ్రైనేజీ పై పైపులు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోని ప్రజలకు విద్యార్థులకు ఉద్యోగులకు బాటసారులకు వ్యవసాయదారులకు ఇబ్బందులు తొలగించాడు. దీంతో కుమ్మితపేరారెడ్డిని పలువురు అభినందించారు.
సేవా కార్యక్రమాల్లో మెప్పిస్తున్న కుమ్మిత
04
Apr