గుంటి గంగలోని తేజ వయో వృద్ధాశ్రయానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆశ్రమానికి అవసరమైన పలు ఉపకరణాలు అందించి చేయూత ఇచ్చారు. సామాజిక సృహా, సేవలో బాగంగా దర్శి బ్రాంచి మేనేజర్ నేలపాటి లక్ష్మినారాయణ ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అవసరమైన రూ.26,500 విలువైన వాటర్ కూలింగ్ మిషన్, మంచాలు, కుర్చీలు అందించారు. ఆశ్రమ నిర్వాహకులు అంబటి వెంకటేశ్వర రెడ్డిని అభినందించారు. ఆశ్రమానికి తమ వంతు చేయూత ఉంటుందనిచెప్పారు.
