రాబోవు ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శివా రెడ్డి, ప్రధాన కార్యదర్శి అజయ్ కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 6 నుంచి 14 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివా సులు, నాయకులు ఆంజనేయులు, గురువార్జునరావు, వెలుగొండయ్య, అనిల్, నాగసాయి తదితరులు పాల్గొన్నారు.

