రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డిలు కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో బుధవారం మండల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ విజయానికి గ్రామ స్ధాయి నుంచి నాయకులు, కార్యకర్తలు కృషి చెయ్యాలని పిలుపు నిచ్చారు. జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…. ప్రతి సచివాలయ పరిధిలో ఈనెల 7 నుండి 14 వరకు సచివాలయ కన్వినర్లు, గృహ సారదులు, వలంటీర్లు సమిష్టిగా పనిచెయ్యాలని అన్నారు. అందరూ సమిష్టిగా ఇంటికి వెళ్లి “జగనన్నే మా భవిష్యత్ ” కిట్లు పంపిణీ చెయ్యాలని చెప్పారు. జగనన్న నువ్వు మా నమ్మకం స్టిక్కర్లును, సెల్ ఫోన్, గోడలకు అతికించాలని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎంఎన్పీ నాగార్జున రెడ్డి. సోసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, జెసీఎస్ మండల కన్వీనర్ యాడిక శ్రీనివాస రెడ్డి, మాజీ సర్పంచి, సచివాలయ కన్వీనర్లు ఎన్. హనుమంతరావు, పులి వికాస్. కొర్రపాటి విష్ణు, పూర్ణ, పీఎంసీ కమిటీ చైర్మన్ క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
