ముండ్లమూరు గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వైద్యాధికారి బి మధు శంకర్ అన్నారు. మండలంలోని మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల శంకరాపురం గ్రామంలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నందు గురువారం ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మేర మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 67 రకాల మందులు, 12 రకాల టెస్టులు నిర్వహించి మందులు ఉచితంగా అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ వైద్య శిబిరాలకు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, సి హెచ్ ఓ కోడూరి శశి, ఏఎన్ఎం ప్రియదర్శిని, ఆషాలు తదితరులు పాల్గొన్నారు.
