రైతులు ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నూతన తహసిల్దార్ ఎండి నయీమ్ అహ్మద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ కు పలు సూచనలు సలహాలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సేవలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ సేవలను ప్రజలకు చేరువ చేసి ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నారు.
రైతులు సమస్యలను సకాలంలో పరిష్కరించండిదర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్
06
Apr