మేలైన పశుసంపద సృష్టికి కృత్రిమ పిండధారణ (ఈ.టి.టి) విధానం ఎంతో మైలైనదని రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సి.ఈ. ఒ) | డాక్టర్ ఎం. శ్రీనివాసరావు అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కృత్రిమ పిండి ధారణతో మేలైన పశుసంపద సృష్టికి తీసుకుంటున్న చర్యలకు రాష్ట్ర సీఈఓ గురువారం తాళ్లూరు మండలంలో పరిశీలించారు. దోసకాయలపాడు గ్రామానికి చెందిన రైతు సురేంద్ర ఆవుకు హాలిస్టెన్ ఫ్రీజర్ (హెచ్.ఎఫ్) విధానం ద్వారా మేలైన జాతి ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన దశలో ఆవుకు రెండు నెలల చూడి కావటంతో పరిశీలించి రైతుకు తగిన సూచనలు ఇచ్చారు. మేలైన జాతి అభివృద్ధి చెంది రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయం అని చెప్పారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ అధికారి షేక్ కాలేషా మాట్లాడుతూ ఎమ్రియో ట్రాన్షర్ టెక్నాలజీ (ఈ.జి. జి) ద్వారా రెండు సంవత్సరాలలో మేలైన జాతి పశువులు ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. కొన్ని వేల విలువైన విధానాన్ని పాడి రైతులకు ఉచితంగా పశుసంవర్ధక శాఖ అందిస్తుందని చెప్పారు. రైతులకు ప్రోత్సాహకంగా రూ. 2500 విలువైన దాణాను అందించారు. దర్శి, చీమకుర్తి సహాయ సంచాలకులు డాక్టర్ పురుషోత్తం, డాక్టర్ వెంకట రెడ్డి, తూర్పు గంగవరం, తాళ్లూరు పశువైద్యాధికారులు డాక్టర్ ఎం రాంబాబు, డాక్టర్ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
