దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానులు గురువారం చీమకుర్తికి తరలి వెళ్లారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా కేకు కోసి అభిమానులకు పంచిపెట్టారు. చీమకుర్తికి తరలి వెళ్లి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివ ప్రసాద్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి, పుష్ప బొకేలు అందజేసి ఆయనను సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ సూది దేవర అంజయ్య. జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, వైసిపి మండల యూత్ అధ్యక్షులు ఇరుగుల కొండారెడ్డి, ఆంజనేయ డైరీ ఎండి ఎనుముల శ్రీనివాసరెడ్డి. వైసీపీ మండల యువ నాయకులు మందలపు అశోక్, నాయుడుపాలెం గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీదేవి రాముడు, బేతపూడి శివ లక్ష్మణరావు, వైకాపా మండల సీనియర్ నాయకులు అబ్బనీ అంజిరెడ్డి, పుచ్చరవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
