ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అందించాలి

పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మండల పరిషత్ ఏవో బి రామాంజనేయులు అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ హాలులో గురువారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తగ్గించాలని, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన వినతుల సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ముండ్లమూరు, మారెళ్ళ, వైద్యాధికారులు వి జ్యోతి, బి మధు శంకర్ ,మాట్లాడుతూ ప్రభుత్వం104 వాహనం ద్వారా గ్రామాల్లోని డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లవద్ద ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలకు వచ్చి వైద్య సేవలు పొందాలన్నారు. సిడిపిఓ భారతి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, చిన్నారులు అంగనవాడి కేంద్రాలకు వచ్చి వారు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలన్నారు . ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *