గుంటి గంగ తిరునాళ్ల సందర్భంగా ఏర్పాట్లను దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి గురువారం పరిశీలించారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూ ఏర్పాట్లు, దేవస్థాన వద్ద భక్తుల సౌకర్యాలు, ప్రభల ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులతో చర్చించారు. దర్శి సీఐ రామకోటయ్య, ఎస్సై ప్రేమకుమార్లు పాల్గొన్నారు.

