ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని 18 సం.లోపు పాటశాలల్లో విద్యను అభ్యసిస్తున్న తల్లి దండ్రులును కోల్పోయిన , నిరాదరణకు గురైన, నిరాశృయులు, నిస్సాయ అనాధ బాలలును ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం జారీ చేసిన నియమ నిబంధనలు,ఉత్తర్వులు ప్రకారం అర్హులైన అర్హులైన బాలలకు ” మిషన్ వాత్సల్య” స్పాన్సర్ షిప్ ( ప్రాయోజిత ) పథకం ద్వారా ప్రతీ నెలకు రూ. 4,000/- ( నాలుగు వేలు) ఆర్థిక బరోసా కల్పించడం జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ శ్రీ కేసలి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలల యొక్క రక్షణ మరియు సంరక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ పథకం గురించి సంభందిత మండల మరియు జిల్లా స్థాయి అధికారులు తో సమీక్షా సమావేశాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేస్తూ రాష్ట్రమంతా అవగాహణ కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గ్రామ/ వార్డ్ స్థాయి లో గల సచివాలయం, ఉపాద్యాయ, అంగన్వాడి , సిబ్బందికి,వాలంటీర్లు ,బాలల కోసము పనిచేస్తున్న ఇతర సిబ్బంది ఇందులో భాగస్వామ్యం కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అర్హులైన బాలలు ఈ నెల 15 వ తేదీ లోపు దరఖాస్తులను సంభందిత అధికారులకు అందజేస్తే వాటిని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆధ్వర్యంలో పరిశీలించి అర్హత కలిగిన బాలలు యొక్క వివరాలను రాష్ట్ర స్థాయి అధికారులుకు మంజూరు కోసం సమర్పించడం జరుగుతుందనీ తెలిపారు.
అనాధ బాలలకు ” మిషన్ వాత్సల్య” పథకం ద్వారా ఆర్థిక చేయూత..…. కేసలి అప్పారావు
06
Apr