వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా డాక్టర్ మీ గ్రామానికి, మీ ఇంటికి వచ్చి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని, ఆరోగ్య విప్లవానికి నాంది పలికిందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగో పాల్ అన్నారు. దర్శి మండలంలోని బొట్లపాలెంలో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా 104 వాహనాన్ని ఆయన గురు వారం ప్రారంభించారు. 104లో ఎమ్మెల్యే వైద్య పరీక్షలు చేయించుకున్నారు. బొట్లపాలెంలోని పోలంరెడ్డి నాగేంద్రానికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.3 లక్షల చెక్ అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లినా వైద్యులు లేక వైద్యం కోసం పడిగాపులు కాసి వెనుదిరిగే పరిస్థితులు ఉన్నాయ న్నారు. నేడు ప్రతి వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లో 14 రకాల టెస్ట్లు, 105 రకాల మందులు అందుబాటులోకి వచ్చాయ న్నారు. వైద్యులు బి.కిరణ్మయి, డాక్టర్ పి.స్పందన, 104 వెహికల్ డీఈఓ, ఎంపీపీ సుధాఅచ్చయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెన్నపూస వెంకటరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వైవీ సుబ్బయ్య, కౌన్సిలర్ వీసీ రెడ్డి, గంగిరెడ్డి పాలెం యలమందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.







