మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి పుట్టిన రోజు వేడుకలు గురువారం చీమకు ర్తిలోని ఆయన నివాసంలో ఆయన అభిమానులు వేడుకగా జరుపుకున్నారు. ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, సతీమణి నందిని, కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. రామతీర్థంలోని తిరునాళ్లలోనే కేకును కట్ చేసి పుట్టిన రోజు వేడుకలను మొట్టమొదట జరుపు కున్నారు. అనంతరం గురువారం తెల్లవారు జామున ఇంటి వద్ద అభిమానులతో కలిసి కేక్ ను కట్ చేశారు. పలువురు అభిమానులు గజ మాలలతో శాలువాలు కప్పి సత్కరించారు. చీమకుర్తి, దర్శి నియోజకవర్గంలోని 5 మండ లాల నుంచి వేలాది మంది పార్టీ శ్రేణులు వచ్చి బూచేపల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలి పారు. వ్యవసాయ రీజనల్ కోఆర్డినేటర్ మారెడ్డి సుబ్బారెడ్డి, చీమకుర్తి ఎంపీపీ యద్దనపూడి శ్రీని వాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాస రావు, మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, పార్టీ పట్టణ కన్వీనర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, రూరల్ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎంపీటీసీ సభ్యులు సూడిదేల విజయభాస్కర్ రెడ్డి , కార్య దర్శి పి.శంకర్ ఆధ్వర్యంలో గుంటి గంగ లోని వృద్ధాశ్రమంలోని పేదలకు అన్నదానం చేశారు.






