ఘనంగా డాక్టర్ బూచేపల్లి జన్మదిన వేడుకలు

దర్శి మండలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. గడియారం స్తంభం సెంటర్ భారీ కేక్ కట్ చేసి అంద రికీ పంచిపెట్టారు. పట్టణంలోని గాంధీ నగర్ తో పాటు పలు గ్రామాల్లో పుట్టిన రోజు కేక్లు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గడియారం స్తంభం సెంటర్లో అన్నదానం చేశారు. చలివేంద్రాన్ని ప్రారంభించారు. పలువురు నాయకులు భారీ సం ఖ్యలో చీమకుర్తి వెళ్లి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, వైద్యవిభాగం రాష్ట్ర అధికారప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వైఎస్సార్ సీపీ నాయకులు ఇరుగుల శ్రీనివాసరెడ్డి, చింతలపూడి శ్రీనివాసరెడ్డి, దుగ్గిరెడ్డి నారాయణరెడ్డి, రాజశే ఖర్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

చీమకుర్తి తరలివెళ్లిన తాళ్లూరు మండల బూచేపల్లి అభిమానులు

దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ బూచే పల్లికి శుభాకాంక్షలు చెప్పేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో గురు వారం చీమ అనుచరుడు మాజీ ఎంపీపీ పోశం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు బూచేపల్లికి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లు పంచుకున్నారు. డాక్టర్ బూచేపల్లి కుటుంబ సభ్యులను గజమాలతో సత్కరించి నిండునూరేళ్లూ ఆరోగ్యంతో జీవించాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎం.పి. పి లు కోట రామి రెడ్డి, గోళ్లపాటి మోషె, ఎంపీటీసీ సభ్యుడు యామర్తి ప్రభుదాసు, మాజీ సొసైటీ డైరెక్టర్ లు గుజ్జుల యోగి రెడ్డి ,గువ్వల శ్రీనివాసరెడ్డి, నారిపెద్ది రామ్మూర్తి, మాజీ సర్పంచ్ కోట పెద్దిరెడ్డి, ఐవీ సుబ్బారెడ్డి, కె.వెంకట్రామిరెడ్డి, ఏసురత్నం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *