జగనన్నే మా భవిష్యత్ను విజయవంతం చేయండి – విలేకరుల సమావేశంలో చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని వీడియో ప్రదర్శించి వివరించిన దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్

కుల మతాలు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ జగనన్నే మా భవిష్యత్ ” కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పిలుపు నిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జగనన్నే మా భవిష్యత్ పేరుతో ప్రతిష్టాత్మకంగా ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈనెల 7 నుండి | 20వ తేదీ వరకు ప్రతి గడపు గృహ సారధులు, గ్రామ/ వార్డు సచివాలయ కన్వీనర్లు. సందర్శించి వారికి గత ప్రభుత్వంతో పోల్చుతూ.. ప్రజా మద్దతు సర్వే నిర్వహించి వారి అభిప్రాయాలను తెలియచేస్తారని, వారి అనుమతితో గృహాలకు, మొబైల్స్క స్టిక్కర్లు అంటిస్తారని చెప్పారు.అనంతరం 8296082960 నెంబర్ కు మిస్ట్ కాల్ ఇస్తారని చెప్పారు. నియోజక వర్గంలో ప్రతి సచివాలయ పరిధిలో ప్రతి కుటుంబం తలుపు తట్టి వారి ప్రజా మద్దతు కూడ గట్టాలని కోరారు. మన ప్రభుత్వ హయాంలో మన బడి నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందినదని, పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్ లు అందిస్తున్నామని చెప్పారు. బీసీలను వెన్నెముకగా గుర్తించి వారికి రాజకీయాలలో ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. నాడు చంద్రబాబు ఎస్సీలను, ఎస్టీలకు కించ పరచారని, రాజకీయంగా వేధించారని విమర్శించారు. ప్రజల నుండి వచ్చినదే మా నమ్మకం నువ్వే జగనన్న నినాదం అని చెప్పారు. రానున్న ఎన్నికలలో మరింత మద్దతు తెలిపి సీఎం వైఎస్ .జగన్ పది కాలాల పాటు సీఎం ను చేసుకుంటే సంక్షేమం, అభివృద్ధితో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అందుకు అందరూ కష్టపడి పని చేసి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో నియోజక వర్గ పరిశీలకులు, రాష్ట్ర దేవాంగుల కార్పోరేషన్ చైర్మన్ బి. సురేంద్ర, రాష్ట్ర గ్రినింగ్ అండ్ బ్యుటిపికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎఎంసీ చైర్మన్ వై. వి సుబ్బయ్య, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు ఎంపీపీలు సుధా అచ్చయ్య, ఎస్. ఎస్ బ్రహ్మానంద రెడ్డి, తాటికొండ శ్రీనివాసరావు, తాళ్లూరు, దొనకొండ జెడ్పీటీసీలు మారం వెంకట రెడ్డి, సుధాకర్ బాబు, జిల్లా యూత్ అధ్యక్షుడు జి. శ్రీకాంత్ రెడ్డి, మాండల పార్టీ అధ్యక్షుడు వెన్న పూస వెంకట రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవ ప్రసాద్, సాంస్కృతి విభాగం అధ్యక్షుడు షేక్ సైదా, కౌల్సిలర్లు వి. సి రెడ్డి, మోహన్ రెడ్డి. ఆవుల జ్యోతి శివా రెడ్డి, బాబు, జెసీఎస్ కన్వినర్లు ఎదురు కోటిరెడ్డి, బత్తిన వెంకటేశ్వర్లు, యాడిక శ్రీనివాస రెడ్డి. మేడికొండ జయంతి, మండల ప్రధాన కార్యదర్శి గోను నారాయణ రెడ్డి, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నా రెడ్డి, డగ్లస్ తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *