ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని పేద, బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేసిన మేలును వివరించటానికే వైఎస్సార్సీపీ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శి పట్టణంలో మూడవ సచివాలయం పరధిలో బాలాజి వెంచర్ వద్ద శుక్రవారం మానమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి నివాసానికి వెళ్లి ప్రభుత్వం చేసిన మేలును. సీఎం చెప్పాడంటే చేస్తాడంతే అంటూ చేసిన మేళ్లను వివరించారు. అదే విధంగా గతంలో చంద్రబాబు చేసిన మోసాలను వివరించి నిన్ను నమ్మం బాబు అంటూ ప్రజలచే చెప్పించారు. అనంతరం ప్రజా మద్దతు పుస్తకాన్ని అందించి అందులో వారి అభిప్రాయాలతో పూరించారు. పాంప్లెట్ ఇచ్చారు. అనంతరం వారి అనుమతితో వాల్ కు, సెల్ కు స్టిక్కర్లు అంటించారు. ఆయా నివాసాలలో అపురూప స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.కార్యక్రమంలో దర్శి నియోజక వర్గ పరిశీలకులు, రాష్ట్ర దేవాంగులు కార్పోరేషన్ చైర్మన్ బి. సురేంద్ర, రాష్ట్ర గ్రినింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, ఎఎంసీ చైర్మన్ వై. వి సుబ్బయ్య, దర్శి ఎంపీపీ సుధా అచ్చయ్య, వైస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెన్న పూస వెంకట రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవ ప్రసాద్, కౌల్సిలర్లు వి. సి రెడ్డి, మోహన్ రెడ్డి, ఆవుల జ్యోతి శివా రెడ్డి, బాబు, జెసీఎస్ కన్వినర్లు ఎదురు కోటిరెడ్డి, బత్తిన వెంకటేశ్వర్లు, యాడిక శ్రీనివాస రెడ్డి, మేడికొండ జయంతి, మండల ప్రధాన కార్యదర్శి గోను నారాయణ రెడ్డి, సొసైటీ చైర్మన్ వేమిరెడ్డి చెన్నారెడ్డి, సర్పంచిల సంఘం అధ్యక్షుడు కీసరి రామ్ భూపాల్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఆవుల శివారెడ్డి, ప్రసాద్ రెడ్డి, కిక్కిరు రమణా రెడ్డి, ఉడుమల వెంకట రెడ్డి, సుబ్బారెడ్డి, కొడవటి జాన్, గంజి వెంకటేశ్వర రెడ్డి, స్టీవెన్, మజ్నువలి, యర్రయ్య, అన్నవరపు రవి, చెరుకూరి జగన్ తదితరులు పాల్గొన్నారు.

