భక్తి శ్రద్ధలతో, ఉపవాస దీక్షల తో క్రైస్తవ సోదరులు శుక్రవారం గుడ్ ఫ్రైడే ని చర్చిలలో ప్రార్థనలతో ఘనంగా నిర్వహించారు. పాపులను రక్షించుటకు ఏసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి సిలువ మరణాన్ని పొంది తిరిగి మూడవ రోజైన ఆదివారం లేచినని క్రైస్తవుల విశ్వాసం, సిలువ మరణం పొందినప్పటికీ సిలువ వేసిన వారి పట్ల, ప్రజల పట్ల మరణం పొందుతూ ఏసుక్రీస్తు మానవాళిపై చూపిన ప్రేమ, దయాగుణం, ఎనలేనిదని క్రైస్తవుల విశ్వాసం, యేసు శిలువతో మాట్లాడి ఏడు మాటలు వివరించి ఏసు క్రీస్తు మార్గంలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలి అన్నారు .మండలంలోని ముండ్లమూరు, వేంపాడు, ఉమామహేశ్వరపురం, పసుపుగల్లు, చిన్న ఉల్లగల్లు, భీమవరం, ఈదర, మారెళ్ళ, తమ్మలూరు, నాయుడుపాలెం, పులిపాడు తదితర గ్రామాల్లోని చర్చిలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పాస్టర్లు అద్దంకి రంజిత్ ఓఫిర్, గురు స్వామి, దేవసొత్తుస్వామి నాయక్, పి డేవిడ్ హరిసన్, పి క్రాంతి కుమార్, పి డేవిడ్, వాక్యోప దేశం అందించారు.


