నెల్లూరు పట్టణంలో జరిగిన జోన్ 4 టిడిపి సమీక్ష సమావేశానికి మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం తరలి వెళ్లారు. ఈ సమీక్ష సమావేశానికి టిడిపి జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరైనారు . ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జిలకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి కార్యకర్తలు అభిమానులు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి తిరిగి ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటున్నారు వారి వివరాలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాలు ఎంతమందికి అందుతున్నాయి వాటి వివరాలు తెలుసుకోవాలన్నారు. గ్రామాల్లో దొంగ ఓట్లు ను గుర్తించాలని తెలిపారు. గ్రామాల్లో ఎంతమందికి ఇల్లు కట్టించారు వాటి వివరాలు తెలుసుకోవాలన్నారు. టిడిపి ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసి పార్టీ వైపు మొగ్గు చూపే విధంగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు వరగాని పౌలు, కొక్కెర నాగరాజు, మాజీ ఎంపీటీసీ సుంకర రాఘవరెడ్డి, సురా శేశిరెడ్డి, పోశం లక్ష్మిరెడ్డి, తమ్మినేని బ్రహ్మం, బరిగే రామ లక్ష్మయ్య, పందుగుల శ్రీనివాసరెడ్డి, కాటూరి గురవయ్య, కుంట నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.
జోన్ 4 టిడిపి సమీక్ష సమావేశానికి హాజరైన టిడిపి నాయకులు
07
Apr