ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద
పీట వేస్తున్నారని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత ,అమ్మబడి, రైతు భరోసా, విద్యా దీవెన, పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారన్నారని అన్నారు. మహిళల రక్షణలో భాగంగా దిశ చట్టాన్ని అమలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారన్నారు. మహిళల జీవనోపాదుల మెరుగు కోసం సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆదాయ అభివృద్ధిని పెంపొందించుకునేందుకు చిరు వ్యాపారాలు ప్రోత్సహించడం జరుగుతుంది అన్నారు. రుణమాఫీ ద్వారా వచ్చిన నగదుకు అదనంగా బ్యాంకు రుణాలు, సామాజిక పెట్టుబడి నిధి ద్వారా రుణాలు అందిస్తున్నామన్నారు. జగనన్న తోడు పడక ద్వారా చిరు వ్యాపారాలు ప్రోత్సహిస్తూ వారి అభివృద్ధికి చేయూత ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం సచివాలయంలో గ్రామ సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపలో మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా వచ్చిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ, పింఛన్లు ,పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ సంబంధించిన సమస్యలను ఈనెల ఆఖరిలోపు సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలనుండి వచ్చిన సమస్య పరిష్కారం కాకుంటే అందుకు సరైన సరైన కారణాలను వారి కలిసి వివరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామ సచివాలయ పరిధిలో 20 లక్షల రూపాయలు మంజూరు కానందున తద్వారా చేపట్టే పనులకు ప్రతిపాదములు సిద్ధం చేయాలని అధికారుల ను ఆయన ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసి గ్రామ అభివృద్ధికి పాటుపడాలన్నారు ప్రధానంగా వేసవి వచ్చిందని త్రాగు నీటి సమస్యపై దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీతా బ్రహ్మానంద రెడ్డి. మండల సచివాలయం కన్వీనర్ మేడికొండ జయంతి. వైస్ ఎంపీపీ వేముల పద్మావతి జానకిరామయ్య. గ్రామ సర్పంచి వరగానీ బాల సుందర రావు, ఎంపీటీసీ దాసరి పెద్ద అంజయ్య, మండల వైసీపీ యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి , పసుపు గళ్ళు సొసైటీ డైరెక్టర్ జిల్లెలముడి శివయ్య, పూరిమెట్ల సర్పంచ్ ఓ గులూ రి రామాంజి, ముళ్ళమూరు సొసైటీ మాజీ అధ్యక్షులు బద్రి వెంకటసుబ్బారెడ్డి, ఉల్లగల్లు సర్పంచి జన మాల నాగేంద్ర పిచ్చయ్య, గర్నపూడి ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.





